కరివేపాకు
సాధారణంగా కరివేపాకును ప్రతిరోజు కూరల్లో, ఇతర ఆహార పదార్థాలలో వాడుతుంటాం. భోజనం చేసేటప్పుడు చాలామంది ఆ కరివేపాకును తీసి అవతల పారేస్తుంటారు. కాని ఆ ఆకులో చాలా లాభాలున్నాయని మనకు తెలియదు. అందుకే కరివేపాకు గురించి మీరు తెలుసుకోవాల్సిందే.
వాంతులు, కడుపులో తిప్పడం, అలసట, నీరసం, కడుపులో వికారం వంటి వాటి నుంచి నివారణకు రెండు స్పూన్ల కరివేపాకు రసంలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి పరగడుపున తాగాలి.
నీళ్ల విరోచనాలు, రక్త విరోచనాలు వంటి రుగ్మతలకు కరివేపాకు అద్బుతంగా పనిచేస్తుంది.
కరివేపాకులో ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, నియాసిన్ వున్నాయి.
కరివేపాకును ఎండబెట్టి పొడిచేసి ఇంగువ, ధనియాలు, జీలకర్రను కలిపి ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది.
ఎదిగే పిల్లలకు ఎముకల దృఢత్వాన్ని కలిగిస్తుంది.
నరాల బలహీనతకు కరివేపాకు మంచి ఔషధం.
కరివేపాకు కాయల రసం, నిమ్మరసాన్ని కలిపి విష కీటకాలు కుట్టిన చోట రాస్తే బాధ నివారణ అవుతుంది.
తల వెంట్రుకల కుదుళ్లకు బలాన్ని కలిగిస్తుంది. కంటికి ఎంతో మంచిది.
కడుపులోని దోషాలకు విరుగుడుగా పనిచేస్తుంది.
నరాల బలహీనతను అరికడుతుంది. నోటిపూతకు దీని చిగురు మంచి నివారణ.
మధుమేహవ్యాధికి గురైన వారు ఉదయం లేవగానే పరగడుపున 5-6 ఆకులను నమిలి మింగితే వ్యాధి తీవ్రత తగ్గుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి మెదడుకు ప్రశాంతతను కలుగచేస్తుంది.
చిన్న వయసులో తలవెంట్రుకలు నెరసిన యువతీయువకులకు కరివేపాకు అద్భుతమైన ఔషధం. ప్రతిరోజు ఉదయాన్నే క్రమం తప్పకుండా నాలుగైదు కరివేపాకులను నమిలి మింగి, మంచినీరు తాగితే త్వరలోనే ఫలితం కనిపిస్తుంది. కొబ్బరినూనెలో 10-15 కరివేపాకులు వేసి బాగా కాచి వడగట్టి, క్రమం తప్పకుండా నిత్యం వాడుతుంటే శిరోజాలు మృదువుగా ఒత్తుగా పెరుగుతాయి.
కాలిన బొబ్బలు, దెబ్బలు, ఇతర చర్మవ్యాధులకు ఆకులను నూరి, సన్నసెగ మీద ఉడకబెట్టి, పైన రాసి కట్టుకడితే త్వరగా నయమవుతాయి.
కరివేపాకును ప్రతిరోజు ఉపయోగిస్తే అందానికి, ఆర్యోగానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.

http://www.prajasakti.com/she/article-160213

No comments:
Post a Comment