ఇది మల్లెల వేళయనీ.........(సుఖ దుఖాలు)
గానం : పీ సుశీల
రచన : దేవులపల్లి కృష్ణ శాస్త్రి
సంగీతం : రాజన్ - నాగేంద్ర
ఇది మల్లెల వేళయనీ .....ఇది మల్లెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల
ముందే కూసిందీ ........విందులు చేసింది
కసిరే ఎండలు కాల్చునని.....
ముసిరే వానలు ముంచునని...
ఇక కసిరే ఎండలు కాల్చునని.....
మరి ముసిరే వానలు ముంచునని...
ఎరుగక కోయిల ఎగిరింది.....విరిగిన రెక్కల ఒరిగింది ......
నేలకు ఒరిగింది ......
ఇది మల్లెల వేళయనీ .....ఇది మల్లెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల
ముందే కూసిందీ ........విందులు చేసింది
మరిగిపోయిన మానవ హృదయం.......
కరుణ కలిగేది చల్లని దైవం ......
వాడే లతకు ఎదురై వచ్చువాడని...వసంతమాసం....
వసివాడని కుసుమ విలాసం....
ఇది మల్లెల వేళయనీ .....ఇది మల్లెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల
ముందే కూసిందీ ........విందులు చేసింది
ద్వారానికి తారామణిహారం........హారతి వెన్నెల కర్పూరం..........
మోసం ద్వేషం లేని సీమలో .......
మొగసాల నిలిచే నే మందారం....
ఊ............ఊ............ఊ...........
ఇది మల్లెల వేళయనీ .....ఇది మల్లెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల
ముందే కూసిందీ ........విందులు చేసింది
No comments:
Post a Comment